బాధ్యత తీసుకుందాం
bheemkonduru ·

మనం ఎలాంటి కుటుంబంలో పుడతాం.
ఎటువంటి పరిస్థితుల్లో పెరుగుతాం.
ఏ మనుషుల మధ్య జీవిస్తాం.
ఎవరి మాటలు వింటూ పెద్దవాళ్లమవుతాం.
ఇవన్నీ మన ఛాయిస్‌లు కాదు. అలా జరుగుతుంది. అంతే.
కానీ ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే — మన జీవితంలో జరిగిన ప్రతి చెడు విషయానికీ కారణం వెతుక్కుంటూ పోతే, మనందరమూ ఒకే పాయింట్ దగ్గర ఆగుతాం.
“నా జీవితం ఇలా ఉండటానికి కారణం వాళ్లే.”
ఇదే victim mindset. ప్రతి సందర్భంలో, ప్రతి విషయంలో మనం బాధితులం అని భావించే మానసిక ధోరణి.
ప్రపంచం అన్యాయంగా ఉందని అనుకోవడం మాత్రమే కాదు.
మన జీవితంపై మనకుండే నియంత్రణను ఇతరులకు అప్పగించడం.
నాకే ఎందుకు?
జీవితంలో ఏదైనా చెడు జరిగినప్పుడు మన మనసు మొదట అడిగే ప్రశ్న ఇదే.
“నాకే ఎందుకు?”
అది సహజం.
కానీ అదే ప్రశ్నను పదే పదే వేసుకుంటూ ఉంటే, అది ఒక ప్రమాదకరమైన అలవాటుగా మారుతుంది
“నా పరిస్థితులు బాగోలేవు కాబట్టి నేను ఇలా ఉన్నాను.”
“వాళ్లు నాకు అవకాశం ఇవ్వలేదు.”
“నా కుటుంబం ఇలా ఉండకపోతే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు.”
“నన్ను అర్థం చేసుకునే వాళ్లు లేరు.”
“నా అదృష్టమే బాగోలేదు.”
ఇవన్నీ కొన్ని సందర్భాల్లో నిజమే కావచ్చు.
కానీ సమస్యేమిటంటే
అవి నిజం కావడం వల్ల అవి మనకు ఒరిగేది ఏమీలేదు
గతం మన తప్పు కాకపోవచ్చు.
కానీ ఆ గతం తర్వాత మనం ఏం చేస్తున్నాం అనేది మాత్రం చాలాసార్లు మన బాధ్యత.
బాధ్యత తీసుకోవడం అంటే మనల్ని మనం నిందించుకోవడం కాదు.
“అంతా నా తప్పే” అనుకోవడం కూడా ఆరోగ్యకరం కాదు.
ఎవరైనా మనల్ని మోసం చేస్తే అది మన తప్పు కాదు.
ఎవరైనా అన్యాయం చేస్తే అది మన బాధ్యత కాదు.
మన నియంత్రణలో లేని పరిస్థితులు ఎదురైతే వాటిని మన మీద వేసుకోవాల్సిన అవసరం లేదు.
Responsibility అంటే blame చేసుకోవడం కాదు.
బాధ్యత అంటే —
“ఇది నా తప్పు కాకపోవచ్చు.
కానీ ఇప్పుడు దీని తర్వాత నేను ఏం చేయాలి?”
అని ప్రశ్నించుకోవడం.
ఆ ఒక్క ప్రశ్న మనల్ని బాధితుడి స్థానం నుంచి బయటకు తీసుకొస్తుంది.
బాధితుడిగా ఉండటం చాలా సౌకర్యంగా ఉంటుంది
ఇది వినడానికి కాస్త వింతగా అనిపించవచ్చు.
కానీ victim mindsetలో ఒక విచిత్రమైన సౌకర్యం ఉంటుంది.
ఎందుకంటే బాధ్యత మనది కాకపోతే, మనం మారాల్సిన అవసరం లేదు కదా.
నా కెరీర్ బాగోలేదు—బాస్ కారణం.
నా సంబంధం బాగోలేదు—అవతలి వ్యక్తి కారణం.
నేను ప్రయత్నించడం లేదు—పరిస్థితులు కారణం.
నేను ముందుకు వెళ్లడం లేదు—అవకాశాలు లేవు.
అలా చెప్పడం వల్ల మనకు తాత్కాలికంగా ఉపశమనం వస్తుంది.
కానీ మన జీవితంపై మనకున్న power కొంచెం కొంచెంగా పోతుంది.
ఎందుకంటే steering wheel మన చేతిలో లేదని మనం నమ్మడం మొదలుపెడతాం.
Extreme ownership అంటే అంతా నీ తప్పే అని కాదు
“నీ జీవితంలోని ప్రతి విషయానికీ నువ్వే కారణం” అనేది కూడా అర్థంలేని సిద్ధాంతం.
కానీ ఒక్క విషయం మాత్రం నిజం.
నీ జీవితంలోని ప్రతి విషయానికి నువ్వు కారణం కాకపోవచ్చు. కానీ దాని తర్వాత నువ్వు చేసే ఎంపికలకు నువ్వే బాధ్యుడివి.
ఎవరైనా నిన్ను అవమానించారు.
వాళ్ల మాటలను నువ్వు నియంత్రించలేవు.
కానీ ఆ మాటలను ఐదేళ్లు మోస్తూ తిరగాలా లేదా అన్నది కొంతవరకు నీ చేతిలో ఉంటుంది.
ఎవరైనా నీకు అవకాశం ఇవ్వలేదు.
ఆ నిర్ణయం వాళ్లది.
కానీ మరో అవకాశం వెతకాలా, కొత్త నైపుణ్యం నేర్చుకోవాలా, దారి మార్చాలా అన్నది నీ నిర్ణయం.
జీవితం మనకు ఎప్పుడూ మంచి కార్డులు ఇవ్వదు.
కానీ చేతిలో ఉన్న కార్డులతో ఏం ఆడాలో మాత్రం మనం నిర్ణయించుకోవాలి
“ఎందుకు?” నుంచి “ఇప్పుడు ఏంటి?”
బహుశా జీవితాన్ని మార్చే పెద్ద ప్రశ్న ఇదే.
“ఇది నాకు ఎందుకు జరిగింది?” అని అడగడం తప్పు కాదు.
కానీ అక్కడే ఆగిపోవద్దు.
దాని తర్వాత ఇంకో ప్రశ్న అడగాలి.
“సరే. ఇది జరిగింది. ఇప్పుడు నేను ఏం చేయగలను?”
ఆ ప్రశ్నలోనే agency ఉంటుంది.
అక్కడి నుంచే action మొదలవుతుంది.
అక్కడి నుంచే మన జీవితానికి మళ్లీ steering wheel మన చేతుల్లోకి వస్తుంది.
ప్రపంచం ఎప్పుడూ fairగా ఉండదు.
అందరూ మనతో మంచిగా ఉండరు.
మనకు అర్హత ఉన్న ప్రతి అవకాశం మనకు దొరకదు.
కొన్ని విషయాలు నిజంగా మనకు అన్యాయం చేస్తాయి.
అయినా ఒక దశలో మనం మన జీవితంతో ఒక ఒప్పందం చేసుకోవాలి:
“ఏం జరిగిందో నేను మార్చలేను. కానీ ఇక నుంచి ఏం జరుగుతుందో నిర్ణయించడంలో నా వంతు నేను చేస్తాను.”
అక్కడితో victim mindset ముగుస్తుంది.
మనం బాధితులుగా ఉండటం ఆపి, మన జీవితానికి రచయితలుగా మారడం మొదలుపెడతాం.
అది ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మార్చడం కాదు.
ప్రపంచం మనకు అనుకూలంగా లేకపోయినా, మనం మన జీవితాన్ని ముందుకు నడిపించగలమనే నమ్మకం.
అదే నిజమైన బాధ్యత.
అదే స్వేచ్ఛ కూడా.