Telugu Life

సాకులు వద్దు

bheemkonduru ·

నిన్ను ఏది ఆపుతోంది?

అలసటగా ఉందా? సరిగ్గా నిద్రపోలేదా? తగినంత శక్తి లేదా? సమయం లేదా? డబ్బులు లేవా?

ఇవేనా నిన్ను ఆపుతున్నవి? లేక నిన్ను ఆపుతున్నది... నువ్వేనా?

సాకులు చెప్పేవాడికి అవి చాలా సమంజసంగా అనిపిస్తాయి. కానీ అవి అబద్ధాలు మాత్రమే — నువ్వు నీకు నువ్వే చెప్పుకునే అబద్ధాలు. నీ మీద నువ్వే జాలిపడకు. బాధాకరమైన కథలు చెబుతూ, అందరూ వచ్చి సానుభూతి చూపించాలని ఆశించడం మానేయ్.

విలాసవంతమైన జీవితం చూసి అసూయపడకు. దాని వెనక కనిపించని కష్టం ఉంటుంది. ఏదీ ఉచితంగా, ఊరకనే రాదు.

లేచి నిలబడు. నీ లోపల నిద్రపోతున్న శక్తిని మేల్కొల్పు.

నీకున్న వనరులు చూసుకో. నీ చుట్టూ ఉన్న అవకాశాలు చూసుకో. నీ జీవితం నచ్చకపోతే, దాన్ని మార్చడానికి ఏదో ఒకటి చేయి. నీకు ఏదైనా కావాలంటే, వెళ్లి దాన్ని సాధించుకో.

నిజం ఏంటంటే — నీ దగ్గర సమయం ఉంది. నైపుణ్యం ఉంది. జ్ఞానం ఉంది. పట్టుదల ఉంది. అన్నీ ఉన్నాయి. లేనిది ఒక్కటే — మొదలుపెట్టే సాహసం.

జీవితంలో ప్రతి మంచి విషయం ఒక సవాలుతోనే మొదలవుతుంది. ఏదీ నేరుగా వచ్చి వొడిలో పడదు. మొదలుపెట్టడం ఎప్పుడూ కష్టంగానే ఉంటుంది. కానీ నీకు అది కావాలంటే, నువ్వు వెళ్లాల్సిందే.

'రేపు' అనేదేదీ లేదు. మనకు ఉన్నది కేవలం ఈ రోజు మాత్రమే.

నీ కల నిజం కావాలంటే, ఇప్పుడే లేచి దాన్ని సాధించు. మైదానంలోనే ఉండు, కష్టపడుతూనే ఉండు.

ఇది నీ సమయం.