పదేళ్ల తర్వాత పశ్చాత్తాపపడే పది తప్పులు
bheemkonduru ·

"అప్పుడు అలా చేసి ఉంటే..."
ఈ నాలుగు పదాలు మనుషుల్ని చాలా బాధపెడతాయి.
మనం చేసే పెద్ద తప్పుల కంటే, తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే పదేళ్ల తర్వాత మనల్ని వెంటాడతాయి. ఆ తప్పులేమిటో చూద్దాం – ఇప్పుడే జాగ్రత్తపడితే, ఆ "అప్పుడు అలా చేసి ఉంటే..." అనుకునే సందర్భాలు రాకుండా చూసుకోవచ్చు.
1. ఇతరులను మెప్పించడం కోసం మన ముఖానికి మాస్క్ పెట్టుకోవడం
రోజూ ముఖం మీద mask పెట్టుకుంటే, ఒకరోజుకు ఆ mask కింద ఏమీ మిగలదు.
ఇతరులు మన గురించి ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ బతికితే, మనం ఎవరో మనకే గుర్తులేకుండా పోతుంది. Perfect గా కనిపించాల్సిన అవసరం లేదు. మన imperfections ని ఎలా handle చేస్తున్నామో చూసి inspire అవుతారు మనుషులు.
✦
2. Negative వ్యక్తులతో boundaries లేకుండా ఉండటం
ఎవరైనా negative attitude తో ఉంటే – ఆ attitude మీకు అంటించుకోకండి.
వెనక్కి తగ్గండి. Toxic వ్యక్తుల నుండి దూరం అవ్వడం స్వార్థం కాదు – అది self-care.
గుర్తుంచుకోండి: వారితో ఉండటం obligation కాదు, choice. ఆ choice మనదే.
✦
3. స్వార్థంగా, అహంకారంతో బతకడం
రాళ్ళ మీద పేరు చెక్కుకోవడం కంటే, మనుషుల హృదయాల్లో చెక్కుకోండి.
మనం మన కోసం మాత్రమే చేసినవి మనతోనే పోతాయి. ఇతరుల కోసం చేసినవి శాశ్వతంగా నిలుస్తాయి.
✦
4. మార్పుకు, ఎదుగుదలకు భయపడటం
మన గతం తెలుసుకోవాలంటే – మన ప్రస్తుత స్థితిగతులు చూసుకోవాలి.
మన భవిష్యత్తు తెలుసుకోవాలంటే – మనం ప్రస్తుతం ఏమి చేస్తున్నామో చూసుకోవాలి.
పాతది వదిలేయకపోతే కొత్తదానికి చోటు ఉండదు. ఆ పాత దారుల్లో కొత్త గమ్యాలు చేరుకోలేము. ఇప్పుడే కొత్త దారిలో అడుగు వేయండి.
✦
5. ఇతరులు నిర్ణయించిన goals కోసం బతకడం
జీవితంలో అతిపెద్ద challenge – మనం ఎవరో తెలుసుకోవడం. రెండవది – దానితో సంతోషంగా ఉండటం.
మనతో disagree అయ్యే వాళ్ళు ఉన్నారా? మంచిదే. అంటే మనం మన దారిలో నడుస్తున్నాం. కాలం మర్చిపోయేంత ఉత్సాహంగా పనిచేస్తుంటే – అది సరైన దారి అని అర్థం.
✦
6. కష్టం వచ్చినప్పుడు వదిలేయడం
Failures అంటూ ఏమీ లేవు – results మాత్రమే ఉంటాయి.
ఊహించినట్లు జరగలేదా? నేర్చుకుని ముందుకు వెళ్ళండి. ఒక్కొక్క అడుగు వేసే వ్యక్తి చివరికి గెలుస్తాడు. ఆ final victory కి చాలా ముందే, చిన్న చిన్న నిర్ణయాల్లోనే యుద్ధం గెలవబడుతుంది.
✦
7. ప్రతి చిన్న విషయాన్ని control చేయాలనుకోవడం
జీవితాన్ని మెల్లగా స్పృశించాలి, గొంతు పిసికి దానిని ఉక్కిరిబిక్కిరి చెయ్యకండి
కాసేపు relax అవ్వండి. అన్నీ మన చేతిలో ఉండాలని పట్టుకుంటే – ఊపిరాడదు. లోతుగా శ్వాస తీసుకోండి. ఇప్పుడు అర్థం కాకపోయినా, అన్నీ సరైన order లోనే ఉన్నాయి. Dots connect అవ్వడానికి కొంచెం time పడుతుంది.
✦
8. మనకు deserve అయినదానికంటే తక్కువకు settle అవ్వడం
దేనినైనా వదిలిపెట్టేయగల బలం కావాలి. మన సామర్థ్యానికి తగినది సాధించుకునేవరకు ఆగగలిగేంత wisdom కావాలి.
కొన్నిసార్లు కళ్ళు కడగడానికి కన్నీళ్లు అవసరం – అప్పుడే ముందున్న అవకాశాలు clear గా కనిపిస్తాయి. Settle అవ్వకండి.
✦
9. "రేపు చేద్దాం" అని వాయిదా వేయడం
మనం చాలా టైమ్ ఉందని అనుకుంటాం. కానీ ఒకరోజు నిద్రలేచేటప్పటికి – time అయిపోయి ఉంటుంది.
అప్పుడు రెండే options: మనం పెట్టుకున్న లక్ష్యాలు చేరుకుని ఉంటాము, లేదా సాధించలేకపోవడానికి సాకుల లిస్టు ఉంటుంది.
✦
10. Lazy గా, wishy-washy గా బతకడం
ప్రపంచం మనకు ఏమీ అప్పు లేదు. మనమే ప్రపంచానికి అప్పు ఉన్నాం.
పగటికలలు కనడం ఆపండి. చెయ్యడం మొదలుపెట్టండి. Wishbone కాదు, backbone develop చేసుకోండి.
ఎప్పుడోఅప్పుడు అంటే ఇప్పుడే. ఎవరోఒకరు అంటే మీరే.
✦
గతకాలపు regrets ని వదిలేయడం ఎలా?
Regret feel అవ్వడం సహజం. "అప్పుడు అలా చేసి ఉంటే..." అని ఆలోచిస్తాం.
కానీ గతాన్ని మార్చలేం. అయినా మనం ఆ ideal fantasy తో real outcome ని compare చేస్తూనే ఉంటాం – time, energy waste చేస్తూ.
ఎందుకు వదలలేం?
ఎందుకంటే మనం మన గురించి ఒక image పెట్టుకుంటాం – మన intentions మంచివి, మనం intelligent, మనం respectful అని. ఆ image కి contradict అయ్యే పని చేసినప్పుడు – మనల్ని మనమే attack చేసుకుంటాం.
"నేను ఇలా ఎలా చేశాను?" అని తిట్టుకుంటాం.
Solution:
ఆ ideal image ని వదిలేయండి. మనం perfect కాదు. మనం మనుషులం. మంచి పనులు చేస్తాం, తప్పులూ చేస్తాం. నిజాయితీగా ఉంటాం, అబద్ధాలూ చెబుతాం. దీనిని అంగీకరిస్తే – గతకాలపు తప్పులు అంత బరువుగా ఉండవు.
చివరి ప్రశ్న
ఒకరోజు మనం చివరిలో నిలబడి, ఆరంభం గురించి ఆలోచిస్తాం.
ఈరోజే ఆ ఆరంభం.
ఒక్క simple question:
ఈరోజు మనం చేయగలిగేది, పదేళ్ల తర్వాత regret అవ్వనిది – ఏమిటి?
ఆ ఒక్క పని చేయండి. ఇప్పుడే.