ఓటమిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నవారే నిజమైన విజేతలు
bheemkonduru ·

జీవితంలో నువ్వు ఏ ఆట ఆడుతున్నా...
కొన్నిసార్లు ఓడిపోవడం తప్పదు.
ఒక పాయింట్ కావచ్చు.
ఒక మ్యాచ్ కావచ్చు.
ఒక సీజన్ కావచ్చు.
ఒక ఉద్యోగం కూడా కావచ్చు.
జీవితం ఒక రోలర్ కోస్టర్‌లాంటిది.
ఎత్తులు ఉంటాయి.
పల్లాలు కూడా ఉంటాయి.
కిందపడినప్పుడు...
మనల్ని మనమే అనుమానించడం సహజం.
మన మీద మనకే జాలి కలగడం కూడా సహజమే.
కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకో.
నీ ప్రత్యర్థికి కూడా ఇలాంటి సందేహాలే ఉంటాయి.
అతనూ తనతో తాను పోరాడుతూనే ఉంటాడు.
అందుకే...
ప్రతికూల ఆలోచనల మీద శక్తిని వృథా చేయకు.
అది ఉపయోగం లేని శక్తి.
కష్టమైన క్షణాలను దాటేయడం ఒక కళ.
ఆ కళలో నైపుణ్యం సాధించాలి.
నా దృష్టిలో...
అదే ఒక నిజమైన ఛాంపియన్ లక్షణం.
ప్రపంచంలో అత్యుత్తములు...
ప్రతి పాయింట్ గెలుస్తారు కాబట్టి అత్యుత్తములు కాదు.
వాళ్లు కూడా మళ్లీ మళ్లీ ఓడిపోతారని తెలుసు.
కానీ...
ఆ ఓటమిని ఎలా స్వీకరించాలో నేర్చుకున్నారు.
అదే వాళ్లను ప్రత్యేకంగా నిలబెడుతుంది.
ఓటమిని అంగీకరించు.
ఏడవాలనిపిస్తే ఏడువు.
కానీ...
ఆ తర్వాత ఒక చిరునవ్వు నవ్వు.
మళ్లీ ముందుకు నడువు.
ఆగకుండా సాగు.
మార్పుకు సిద్ధంగా ఉండు.
ప్రతి అనుభవంతో ఎదుగు.
మరింత కష్టపడు.
అంతకంటే ముఖ్యంగా...
తెలివిగా కష్టపడు.
అవును...
కేవలం ఎక్కువ పని చేయడం కాదు.
సరైన దిశలో, సరైన విధంగా పని చేయడం నేర్చుకో.
ఇది 2024లో డార్ట్‌మౌత్ కళాశాల స్నాతకోత్సవంలో రోజర్ ఫెడరర్ చేసిన ప్రసంగం స్ఫూర్తితో రూపొందించిన తెలుగు పాఠకుల కోసం స్వేచ్ఛానువాదం. పూర్తి ప్రసంగం కోసం చూడండి — Dartmouth Commencement Address, 2024