మన రోజును అర్థవంతం చేసుకోవడం ఎలా?
bheemkonduru ·

ఉదయం లేవగానే మనం చేసే మొదటి పని ఏమిటి?
ఫోన్ చెక్ చేస్తాం.వాట్సాప్ చూస్తాం.ఇన్‌స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తాం.ఇమెయిల్స్‌కి రిప్లై ఇస్తాం.
రోజు ముగిసేసరికి ఏమవుతుంది?
చాలా బిజీగా ఉన్నట్టు అనిపిస్తుంది.కానీ నిజంగా ముఖ్యమైన పని ఏదైనా పూర్తయ్యిందా అని ఆలోచిస్తే…
స్పష్టమైన సమాధానం ఉండదు.
ఇది చాలామందికి ఉన్న సమస్య.
కానీ దీనికి ఒక చాలా సింపుల్ పరిష్కారం ఉంది.
MIT.
MIT అంటే ఏమిటి?
Most Important Task.
రోజులో ఖచ్చితంగా పూర్తి కావాల్సిన పని – అదే MIT.
కేవలం ఒక్కటి కాదు.మూడు పనులు.
ఈ మూడు పనులు పూర్తయితే – ఆ రోజు విజయవంతమైంది అని నిశ్చయంగా చెప్పుకోవచ్చు.
మిగతా పనులు ఎన్ని చేసినా పరవాలేదు.కానీ ఈ మూడు మాత్రం – తప్పకుండా చేసి తీరాలి.
ఇది ఎలా పని చేస్తుంది?
ముందురోజు రాత్రే నిర్ణయించుకోవాలి.
రేపు ఏ మూడు పనులు తప్పకుండా పూర్తి చేయాలో ముందే రాసుకోవాలి.
పేపర్ మీదైనా. ఫోన్ నోట్స్‌లో అయినా సరే.కనిపించే చోట ఉండాలి – అంతే.
ఉదయమే మొదలు పెట్టాలి.
నిద్ర లేవగానే,కాఫీ తాగిన వెంటనే, ఫోన్ చూడకముందే.
“తర్వాత చేస్తాను” అనుకుంటే – ఆ పని జరగదు.
రోజు గడిచే కొద్దీమరిన్ని పనులు,మరిన్ని కాల్స్,మరిన్ని మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి.
అందుకే – ముందే పూర్తి చేయాలి.
ఒక MIT – మీ స్వప్న సాఫల్యం కోసం
మూడు MITs లో ఒకటి తప్పకుండా మీ పర్సనల్ గోల్ కోసం ఉండాలి.
ఇది రూల్.
మిగతా రెండు ఆఫీస్ పనులైనా కావచ్చు,ఇంటి పనులైనా కావచ్చు,urgent పనులైనా కావచ్చు.
కానీ ఒక పని మాత్రం – మీ లక్ష్యం కోసం తప్పనిసరి.
ఇక్కడే అసలు magic ఉంది.
ప్రతి రోజు ఒక అడుగు
మీకు ఒక కల ఉంది.
పుస్తకం రాయాలని. కొత్త స్కిల్ నేర్చుకోవాలని. బిజినెస్ మొదలుపెట్టాలని. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని.
కానీ “బిజీ” అనే సాకుతో ఆ కలలను రోజూ పక్కన పెడుతుంటాం.
MIT సిస్టమ్ ఇక్కడే పని చేస్తుంది.
- పుస్తకం రాయాలనుకుంటున్నారా? ఈ రోజు రెండు పేజీలు రాయండి – ఇది MIT.
- కొత్త భాష నేర్చుకోవాలనుకుంటున్నారా? ఈ రోజు 30 నిమిషాలు కేటాయించండి – ఇది MIT.
- బిజినెస్ ప్లాన్ వేయాలనుకుంటున్నారా? ఈ రోజు మార్కెట్ రీసెర్చ్ పూర్తిచెయ్యండి– ఇది MIT.
- కుటుంబంతో సమయం గడపాలనుకుంటున్నారా? ఈ రోజు ఒక గంట కుటుంబం కోసం – ఇది MIT.
చిన్న అడుగు.కానీ ప్రతి రోజు.
మొదట్లో కష్టం – సహజమే
మొదటి వారం కష్టంగా ఉంటుంది.
లేవగానే ఫోన్ చూడాలనిపిస్తుంది.మెసేజ్‌లు చెక్ చేయాలనిపిస్తుంది. న్యూస్ చదవాలనిపిస్తుంది.
పర్లేదు. అది సహజం.
ఆ ఫీలింగ్‌ను ignore చేసి – మీ MIT మొదలు పెట్టండి.
కేవలం ఐదు నిమిషాలు.
ఆ ఐదు నిమిషాల తర్వాత – flow వస్తుంది.momentum వస్తుంది.
ఒక వారం తర్వాత – అది అలవాటు అవుతుంది.మూడు వారాల తర్వాత – MIT లేకుండా రోజు అసంపూర్ణంగా అనిపిస్తుంది.
చిన్న పని – పెద్ద మార్పు
ఇది చాలా చిన్న టెక్నిక్‌లా అనిపించొచ్చు.
మూడు పనులు రాయడం.ఉదయం వాటిని పూర్తి చేయడం.అంతే.
కానీ ఈ చిన్న విషయంలో పెద్ద శక్తి ఉంది.
మీరు బిజీగా కాకుండా – productive గా మారతారు.పనులు చేయడం కాదు – ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు.
రోజు చివరికి“ఈ రోజు నిజంగా అవసరమైన పని చేశాను”అనే సంతృప్తి ఉంటుంది.
ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేం.
రేపు ఉదయం నుంచే
ఇప్పుడే నిర్ణయించుకోండి.
రేపు ఉదయం లేవగానే ఏ మూడు పనులు పూర్తి చేస్తానో రాసుకోండి.
వాటిలో ఒకటి – మీ కల కోసం ఉండేలా చూసుకోండి.
రేపు ఉదయం ఫోన్ చూడకముందే, ఇమెయిల్ తెరవకముందే – ఆ మూడు పనులు మొదలు పెట్టండి.
కొన్నిసార్లు చిన్న విషయాలే పెద్ద మార్పులకు కారణమవుతాయి.
MIT – మీ రోజుకు అర్థం ఇచ్చే చిన్న టెక్నిక్.
ప్రయత్నించి చూడండి.