Telugu Life

మీ సంతోషాన్ని దూరం చేసే 3 ఆలోచనా ధోరణలు

bheemkonduru ·

మన సంతోషాన్ని దూరం చేసే మూడు ప్రధానమైన మైండ్‌సెట్‌లు (ఆలోచనా ధోరణులు), వాటిని స్టోయిసిజం(Stoicism)లో చెప్పిన సూత్రాల ద్వారా ఎలా అధిగమించాలో చూద్దాం.

తీరని కోరికలు (Unmet Desires)

"నాకు ఆ డబ్బు, పేరు లేదా ఫలానా వస్తువు వచ్చినప్పుడు నేను సంతోషంగా ఉంటాను" అనుకోవడం మనల్ని ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంచుతుంది. మనం కోరుకున్నది సాధించిన తర్వాత కూడా ఆ సంతోషం కొద్దిసేపు మాత్రమే ఉండి, మళ్ళీ మన మానసిక స్థితి పాత స్థాయికి పడిపోతుంది. దీనినే 'Hedonic adaptation' అంటారు. మనం చాలా త్వరగా పరిస్థితులకు అలవాటు పడిపోతాం. దాని వల్ల మనం అనుకున్నది సాధించినా మన అనుకున్న సంతోషం ఎక్కవకాలం ఉండదు. దీనికి పరిష్కారం ఏమిటంటే, భవిష్యత్తుపై ఆధారపడకుండా మీ దగ్గర ఉన్నదానితో ఈ రోజే సంతోషంగా ఉండటం నేర్చుకోవడం. మీ సంతోషానికి మీరే కారణం అని, బయటి వస్తువులు లేదా వ్యక్తుల అవసరం లేదని గుర్తించాలి, తెలుసుకోవాలి.


ఇతరులతో పోల్చుకోవడం (Isolated Upward Comparison)

మన దగ్గర లేని ఒక విషయాన్ని మాత్రమే తీసుకుని, ఆ విషయంలో మనకంటే మెరుగ్గా ఉన్న వ్యక్తులతో పోల్చుకోవడం మన సంతోషాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. దీనికి విరుగుడు కృతజ్ఞతా భావం. మనలాంటి జీవితం కావాలని కోరుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారని మనం గ్రహించాలి. ఇతరుల పట్ల దయ, జాలి మరియు సానుభూతి చూపించడం అలవాటు చేసుకుంటే, మీ పట్ల కూడా మీరు అదే విధంగా సానుకూలంగా ఉండగలుగుతారు.


అవాస్తవిక అంచనాలు (Expectations)

"నాకు ఇలా జరిగి ఉండాల్సింది" అని పదే పదే అనుకోవడం వల్ల మన ఊహకు మరియు వాస్తవానికి మధ్య చాలా గ్యాప్ వస్తుంది, ఇదే మన బాధకు కారణమవుతుంది. మీ నియంత్రణలో ఉన్నదేంటో, లేనిదేంటో గుర్తించి, జరిగిపోయిన దాన్ని అంగీకరించి ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న పనులపై దృష్టి పెట్టండి. "మనం వాస్తవానికి విరుద్ధంగా ఆలోచించినప్పుడే నిజమైన బాధను అనుభవిస్తాము" అని రచయిత్రి బైరాన్ కేటీ అంటారు. మన జీవితంలో జరిగే సంఘటనలు ఎప్పుడూ మనల్ని బాధపెట్టవు, ఆ సంఘటనల పట్ల మనకున్న అభిప్రాయమే (Judgment) మనల్ని బాధిస్తుందని గొప్ప స్టోయిక్ తత్వవేత్తలు చెబుతారు.


నిజమైన సంతోషం అనేది మనకు బయట దొరికే వస్తువు కాదు, అది మన ఆంతరంగికమైన ఆలోచనా విధానంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అనవసరమైన అంచనాలు వదిలేసి, వాస్తవాన్ని అంగీకరించడం మరియు ఉన్నదాని పట్ల కృతజ్ఞతగా ఉండటం ద్వారానే మనం జీవితంలో ఆనందాన్ని పొందగలం.