జీతం పెరిగినప్పుడల్లా… జీవితం కూడా ఖరీదవ్వాలా?
bheemkonduru ·

ఉద్యోగం లేని రోజుల్లో
మన కోరికలు, ఇష్టాయిష్టాలు ఒక స్థాయిలో ఉంటాయి.
ఓ బైక్,
ఓ మోస్తరు ఫోన్
చిన్నచిన్న వీకెండ్ సరదాలు.
మొదటి జీతం వచ్చినప్పుడు
మన కోరికల స్థాయి కాస్త పెరుగుతుంది
దానితోపాటు మన ఖర్చులూ పెరుగుతాయి
ఏదో ఒక రకంగా జీతాన్ని ఖర్చుల్ని బ్యాలెన్స్ చేస్తాం.
జీతం కొంచెం పెరుగుతుంది.
మనకు కొత్త కొత్త ఆలోచనలు రావడం మొదలవుతుంది.
“ఇక life కొంచెం comfortableగా ఉండాలి కదా!”
అసలు కథ అప్పుడు మొదలవుతుంది
ముందు ₹20,000 జీతంతో బతికాం.
తర్వాత ₹40,000 వచ్చింది.
“ఇక డబ్బు విషయంలో tension ఉండదు.” అనిపిస్తుంది
కానీ కొన్నాళ్లకు…
₹40,000 కూడా సరిపోదు.
₹60,000 వస్తుంది.
అయినా సరిపోదు. మళ్లీ అదే కథ.
₹1 లక్ష వస్తుంది.
అయినా…
“జీతం అసలు ఎటు పోతుందో తెలియడం లేదు!” అంటాం.
జీతం పెరుగుతోంది.
కానీ సరిపోతుందన్న భావన మాత్రం ఉండదు.
ఇదే Lifestyle Inflation.
జీతం పెరిగినప్పుడు మన ఖర్చులు కూడా నెమ్మదిగా పెరుగుతాయి.
ముందు సాధారణ restaurant సరిపోయేది.
ఇప్పుడు కొంచెం మంచి place కావాలి.
ముందు ₹15,000 phone బాగానే అనిపించేది.
ఇప్పుడు ₹60,000 phone “value for money” అనిపిస్తుంది.
ముందు ఇంట్లో వండుకునేవాళ్లం.
ఇప్పుడు food delivery convenience అయింది.
ముందు economy flight సరిపోయేది.
ఇప్పుడు కొంచెం extra పెట్టి better seat.
ముందు చిన్న ఇల్లు.
ఇప్పుడు కొంచెం పెద్దది.
ముందు ఒక subscription.
ఇప్పుడు అయిదు.
ఒక్కో ఖర్చు విడిగా చూస్తే పెద్దగా ఏమీ అనిపించదు.
కానీ అన్నీ కలిసి మన జీవితాల్లో ఖర్చుల్ని నెమ్మదిగా పైకి లాగుతాయి.
ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఉంది.
మన income పెరిగినప్పుడు…
మన expectations కూడా దానితో పాటు పెరుగుతాయి.
మనం ఒక స్థాయికి చేరుకున్నాక…
అదే స్థాయి normal అయిపోతుంది.
ఒకప్పుడు luxury అనిపించినది…
కొంతకాలానికి basic అవసరం అవుతుంది.
తరువాత దాని కంటే ఇంకొంచెం బెటర్‌ది కావాలి.
ఇదే అసలు trap.
మన జీవితం మెరుగుపడుతోంది.
కానీ మనకు అది మెరుగుపడుతున్నట్టుగా అనిపించడం తగ్గిపోతుంది.
ఎందుకంటే మన brain కొత్త comfortకి చాలా త్వరగా అలవాటుపడుతుంది.
ఒకప్పుడు AC వేసుకుంటే అదో లగ్జరీ.
తర్వాత AC లేకుండా నిద్రపట్టదు.
ఒకప్పుడు weekend బయట తినడం treat.
తర్వాత ఇంట్లో వండుకోవడం effort.
ఒకప్పుడు మరీ అవసరం అయితేనే Cab
తర్వాత auto ఎక్కడం కూడా inconvenience.
ఒకప్పుడు కొత్త బట్టలు కొంటే ఆనందం.
తర్వాత wardrobe నిండిపోయినా…
“వేసుకోవడానికి ఏమీ లేవు” అంటాం.
మన దగ్గర వస్తువులు పెరుగుతుంటాయి.
కానీ వాటి వల్ల వచ్చే ఆనందం మాత్రం అదే proportionలో పెరగదు.
అలవాటు మన ఆనందాన్ని మింగేస్తుంది.
అయితే ఖర్చే చేయకూడదా?
విషయం అది కాదు.
జీతం పెరిగితే మన జీవితం కూడా కొంచెం మెరుగుపడాలి.
మంచి ఇల్లు కావచ్చు.
మంచి food కావచ్చు.
Travel కావచ్చు.
మనకు ఇష్టమైన వాటిపై ఖర్చు చేయడం తప్పు కాదు.
సమస్య ఎక్కడంటే—
మన income పెరిగిన ప్రతిసారీ, ప్రతి ఖర్చూ పెరగాల్సిన అవసరం లేదని మర్చిపోతాం.
ఒక raise వచ్చింది.
దాంతో మొత్తం lifestyle upgrade చేయాల్సిన అవసరం లేదు.
కొంత జీవితం కోసం.
కొంత భవిష్యత్తు కోసం.
కొంత freedom కోసం.
అంతే.
నిజానికి డబ్బు సంపాదించడం వల్ల మనకు పొందాల్సింది ఖరీదైన జీవితం కాదు.
ఎంపిక చేసుకునే స్వేచ్ఛ.
“ఈ పని నచ్చడం లేదు. కొంతకాలం బ్రేక్ తీసుకోగలను.”
“ఇప్పుడు job change కోసం ప్రయత్నించడానికి భయపడాల్సిన అవసరం లేదు.”
“అనుకోకుండా ఏదైనా జరిగితే manage చేయగలను.”
“నా కుటుంబం కోసం కొంత safety ఉంది.”
డబ్బు ఇచ్చే నిజమైన comforts ఇవి.
కొత్త phone కాదు.
కొత్త car కాదు.
కొత్త restaurant కాదు.
ఆర్థికపరంగా కాస్త breathing room, వెసులుబాటు
అందుకే జీతం పెరిగినప్పుడు మనకు రావాల్సిన ప్రశ్న
“ఇప్పుడు ఇంకేం కొనగలను?” కాదు.
“ఇప్పుడు ఇంకేం కొనకుండా ఉండగలను?” అని
సంపన్నంగా ఉండటం అంటే ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు.
సంపాదన ఎంతయినా సరే
మన lifestyle మనల్ని ముంచెయ్యకుండా చూసుకోవడం కూడా.
ఒక చిన్న raise వచ్చింది.
దాన్ని మొత్తం ఖర్చుగా మార్చకపోతే?
అదే raise కొంతకాలానికి savings అవుతుంది.
తర్వాత investment అవుతుంది.
తర్వాత security అవుతుంది.
చివరికి…
freedom అవుతుంది.
అదే lifestyle inflationకి మనం ఇవ్వాల్సిన సమాధానం.
మనకు ఎక్కువ సంపాదించాలి.
ఖచ్చితంగా.
కానీ ఒక దశలో…
మనకు మనమే ప్రశ్నించుకోవాలి.
“income పెరుగుతున్నదా…
లేక ఖర్చుల standard మాత్రమే పెరుగుతున్నదా?”
ఎందుకంటే graphలో రెండు lines పైకి వెళ్తుండవచ్చు.
ఒకటి income.
మరొకటి expenses.
మధ్యలో చిన్న gap ఉంటుంది.
అది మనకు కనిపించకపోవచ్చు.
కానీ…
మన financial freedom మొత్తం ఆ చిన్న gapలోనే ఉంటుంది.
అందుకే జీతం పెరిగిన ప్రతిసారీ జీవితం ఖరీదవ్వాల్సిన అవసరం లేదు.
కొన్నిసార్లు…
జీతం పెరగాలి.
కానీ మనకు “చాలు” అనిపించే సామర్థ్యం కూడా పెరగాలి.