కొత్త సంవత్సరం., ఓ ఐదు ప్రశ్నలు
bheemkonduru ·

కొత్త సంవత్సరం వచ్చేసింది!
Happy New Year!
ఇప్పుడు అందరి నోటా ఒకే మాట – "New Year Resolutions ఏం పెట్టుకున్నావ్?"
జిమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలా? కొత్త skill నేర్చుకోవాలా? ఉదయం 5 గంటలకు లేవాలా?
ఇలా ఎన్నో.,
కానీ ఆగండి.
కొత్త లక్ష్యాలు నిర్ణయించుకునే ముందు, మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకోవడం అవసరం కదా? GPS లో destination పెట్టే ముందు current location enable చేయాలి. అదే విధంగా, కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే ముందు, గత సంవత్సరంలో మనం ఎక్కడ ఉన్నామో, ఏం నేర్చుకున్నామో ఒక్కసారి చూసుకోవాలి.
మన పెద్దలు దీన్నే "ఆత్మావలోకనం" అన్నారు.
ఇది self-criticism కాదు. ఇది self-awareness. తప్పులు వెతుక్కోవడం కాదు – గత సంవత్సరంలో నేర్చుకున్న లేదా గత సంవత్సరం నేర్పిన పాఠాలు గుర్తించుకోవడం.
ఈ కొత్త సంవత్సరంలో మనకు మనం ఈ ఐదు ప్రశ్నలు వేసుకుందాం. నిజాయితీగా జవాబులు చెప్పుకుందాం. ఆ స్పష్టత మన 2026 ప్రయాణానికి దిక్సూచిలా దారిచూపుతుంది.
①
గత సంవత్సరం నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిన మూడు క్షణాలు ఏవి?
ఇది పెద్ద achievements గురించి కాదు.
ఒక సాయంత్రం కుటుంబంతో కలిసి భోజనం చేసిన క్షణం కావచ్చు.
ఎప్పటి నుండో మాట్లాడాలనుకున్న స్నేహితుడికి ఫోన్ చేసిన రోజు కావచ్చు.
ఒక project successfully complete చేసిన తర్వాత వచ్చిన తృప్తి కావచ్చు.
ఆ క్షణాలను గుర్తు తెచ్చుకోండి. వాటిలో ఒక pattern ఉంటుంది.
మీకు నిజంగా ఏది సంతోషాన్ని ఇస్తుందో ఆ pattern చెబుతుంది. ఈ సంవత్సరం ఆ విషయాలకు ఎక్కువ సమయం కేటాయించండి.
"సంతోషం బయట వెతికితే దొరకదు, లోపల గుర్తిస్తే కనిపిస్తుంది."
②
గత సంవత్సరం బాగా కష్టంగా అనిపించిన సమయం ఏది? దాని నుండి నేను ఏం నేర్చుకున్నాను?
కష్టాలు రాకుండా ఉండవు. కానీ అవి వృథా అవ్వకూడదు.
ఉద్యోగం పోయిందా? Relationship లో problems వచ్చాయా? ఆరోగ్యం దెబ్బతిన్నదా? ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయా?
ఆ కష్టకాలంలో మీరు ఎలా react అయ్యారు? ఏం చేశారు? ఏం చేయకపోయి ఉంటే బాగుండేది? ఎవరు మీకు support గా నిలబడ్డారు?
ఆ కష్టం మిమ్మల్ని బలంగా మార్చిందా? ఏదైనా కొత్త perspective ఇచ్చిందా? ఆ పాఠాలు మీ అమూల్యమైన assets. వాటిని మర్చిపోకండి.
③
గత సంవత్సరం నేను "No" చెప్పాల్సి ఉండి "Yes" చెప్పిన సందర్భాలు ఏవి?
ఇది చాలా important question.
మనలో చాలామంది "No" చెప్పడానికి భయపడతాం. ఎదుటివారిని hurt చేస్తామేమో, selfish గా కనిపిస్తామేమో అని.
కానీ మనం చెప్పే ప్రతి "Yes" వెనుక ఒక hidden "No" ఉంటుంది.
అనవసరమైన meeting కి "Yes" అంటే – మీ కుటుంబంతో గడిపే సమయానికి "No" అన్నట్టు. Toxic relationship కి "Yes" అంటే – మీ మానసిక ప్రశాంతతకి "No" అన్నట్టు. ఇతరుల expectations కి "Yes" అంటే – మీ dreams కి "No" అన్నట్టు.
మన దగ్గర ఉన్న resources కి limit ఉంది. Time, energy, attention – ఇవన్నీ limited. వాటిని wisely వాడాలి.
ఈ సంవత్సరం మీ boundaries clear గా పెట్టుకోండి.
④
నేను వాయిదా వేస్తూ వచ్చిన ఒక ముఖ్యమైన పని ఏది?
మనందరికీ ఎప్పటినుండో చెయ్యాల్సిన ఒక పని ఉంటుంది – చేయాలని తెలుసు, కానీ ఎందుకో వాయిదా వేస్తూనే ఉంటాం.
Health checkup చేయించుకోవాలి అని months గా అనుకుంటున్నారా? ఆ important conversation ఇంకా pending లో ఉందా? Career switch గురించి ఆలోచిస్తూనే ఉన్నారా? ఆ పాత స్నేహితుడిని కలవాలనుకుని ఎంతకాలమైంది?
"ఆలస్యం అమృతం విషం" – delay చేసేకొద్దీ, ఆ పని మరింత కష్టంగా మారుతుంది.
ఆ ఒక్క పని ఏదో గుర్తించండి. ఈ సంవత్సరం మొదటి quarter లోనే దాన్ని complete చేయండి.
⑤
గత సంవత్సరం నా జీవితంలోకి వచ్చిన వ్యక్తులలో ఎవరికి కృతజ్ఞత చెప్పాలి?
Success ఎప్పుడూ solo effort కాదు.
గత సంవత్సరం మిమ్మల్ని support చేసిన వ్యక్తులు ఎవరు?
మీకు opportunity ఇచ్చిన వారు? కష్టకాలంలో పక్కన నిలబడిన వారు?
మీ mistakes ను క్షమించిన వారు? మీ growth కోసం sacrifice చేసిన వారు?
వారికి thank you చెప్పారా?
ఒక simple message, ఒక phone call, లేదా కలిసినప్పుడు హృదయపూర్వకంగా చెప్పే "Thank you" – ఇవి చాలు.
"ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు" – మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనల్ని shape చేస్తారు. మంచి వ్యక్తులను మీ జీవితంలో ఉంచుకోండి. వారికి విలువ ఇవ్వండి.
ఇప్పుడు ఏం చేయాలి?
ఈ వారంలో ఒక గంట సమయం తీసుకోండి. ఈ ఐదు ప్రశ్నలకు జవాబులు రాసుకోండి.
ఎక్కడైనా సరే – మీ favorite coffee shop లో, ఇంట్లో ఒంటరిగా, లేదా ఉదయం నడకలో.
ఫోన్ silent లో పెట్టండి. Distractions దూరంగా ఉంచండి. మీతో మీరు honest గా ఉండండి.
రాసుకున్న తర్వాత, ఆ జవాబుల్లో ఒక theme కనిపిస్తుంది. అదే మీ 2026 కి దిశానిర్దేశం.
చివరి మాట
New Year Resolutions fail అవ్వడానికి ఒక main reason – అవి మన వాస్తవజీవితానికి relevant కాకపోవడం. మనం Instagram లో చూసిన వారి goals copy చేస్తాం. లేదా society expect చేసేవి పెట్టుకుంటాం.
కానీ ఈ ఐదు ప్రశ్నల ద్వారా వచ్చే clarity వేరు.
ఇది మీ జీవితం. మీ అనుభవాల నుండి వచ్చిన పాఠాలు. మీకు నిజంగా ఏది కావాలో ఆ అవగాహన.
గత సంవత్సరాన్ని judge చేయకండి – దాని నుండి నేర్చుకోండి. కొత్త సంవత్సరాన్ని fear తో కాదు – awareness తో స్వాగతించండి.
2026 మనకు clarity, courage, మరియు సంతోషాన్ని తీసుకురావాలని కోరుకుందాం!
