కొంచెం నిదానంగా.,
bheemkonduru ·

అంతా హడావిడి
ఉరుకులు, పరుగులు
చిటపటలు, రుసరుసలు
ఇలా కాదుగాని, కొంచెం వెరైటీగా ఆలోచిద్దాం.,
జీవితాన్ని కాస్త ఎంజాయ్ చెయ్యడానికి కొన్ని ఉపాయాలు.
ఖాళీగా ఉండడానికి రోజులో సమయం కేటాయించండి (పని చాలా ఎక్కువగా ఉందా అయితే ఇది మరీ ముఖ్యం).
అతి సీరియస్‌గా ఉండే విషయాల నుంచి కొంచెం దూరంగా ఉండండి. నవ్వడానికి ప్రయత్నించండి. అది కష్టంగా అనిపిస్తే… ముందు చిరునవ్వుతో మొదలుపెట్టండి.
సుఖంగా, సౌకర్యంగా ఉండే అవకాశం దొరికితే ఎప్పుడూ వదులుకోకండి.
ఒక కప్పు టీ లేదా కాఫీ తాగండి. కాళ్లు పైకి పెట్టి విశ్రాంతి తీసుకోండి.
నెమ్మదిగా మాట్లాడండి. ప్రశ్నకు సమాధానం చెప్పేముందు కాస్త ఆగండి. కొత్త ఆలోచన ఏదైనా రావచ్చు. ప్రశ్నకు ప్రతిస్పందన అవసరం — కానీ మీ సమాధానం తప్పనిసరి కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి
తరచూ ఆవలించండి. ఆవలింతలు మంచి చేస్తాయని వైద్య పరిశోధనలు కూడా చెబుతున్నాయి
ఎక్కువసేపు పడుకోండి. నిద్రకు అన్యాయం చెయ్యవద్దు — ఎందుకంటే ఏమీ చేయకపోవడం కూడా ఒక పెద్ద పనే.
ఒకేసారి చాలా పనులు చేయడం ఓ బలహీనత. ఒక పని చేస్తున్నప్పుడు కేవలం ఆ ఒక్క పనే చేయండి.
ఏం చేయాలో జాగ్రత్తగా ఎంచుకోండి. గుర్తుంచుకోండి — ఒక పని మీరు చెయ్యదగినదైతే, అది నెమ్మదిగా కూడా చెయ్యదగినదై ఉంటుంది