Telugu Life

ఇష్టమైన కష్టం...

bheemkonduru ·

క్రమశిక్షణతో సాధన చేయడం కష్టం. పశ్చాత్తాపంతో కుమిలిపోవడం కష్టం.
నీకు ఏ కష్టం కావాలో నువ్వే ఎంచుకో.

బరువు పెరిగితే బాధపడటం కష్టం. ప్రతిరోజూ వ్యాయామం చేయడం కష్టం.
నీకు ఏ కష్టం కావాలో నువ్వే ఎంచుకో.

అప్పుల్లో కూరుకుపోవడం కష్టం. ఆర్థిక క్రమశిక్షణతో బతకడం కష్టం.
నీకు ఏ కష్టం కావాలో నువ్వే ఎంచుకో.

మనసు విప్పి మాట్లాడటం కష్టం. మాట్లాడకుండా దూరం పెంచుకోవడం కష్టం.
నీకు ఏ కష్టం కావాలో నువ్వే ఎంచుకో.

ఒంటరితనాన్ని తట్టుకోవడం కష్టం. విషపూరితమైన బంధాల్లో ఇరుక్కోవడం కష్టం.
నీకు ఏ కష్టం కావాలో నువ్వే ఎంచుకో.

స్వార్థం వీడి క్షమించడం కష్టం. ద్వేషాన్ని మోస్తూ జీవించడం కష్టం.
నీకు ఏ కష్టం కావాలో నువ్వే ఎంచుకో.

కొత్త విషయాలు నేర్చుకోవడం కష్టం. మార్పును స్వీకరించక వెనుకబడిపోవడం కష్టం.
నీకు ఏ కష్టం కావాలో నువ్వే ఎంచుకో.

పెట్టుకున్న లక్ష్యం కోసం నిద్రలేని రాత్రులు గడపడం కష్టం. ఓటమి భయంతో మొదలుపెట్టకుండా ఆగిపోవడం కష్టం.
నీకు ఏ కష్టం కావాలో నువ్వే ఎంచుకో.

జీవితం ఎప్పటికీ సులభం కాదు.
అది ఎల్లప్పుడూ కష్టంగానే ఉంటుంది.
కానీ ఆ కష్టాన్ని ఎంచుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది.

Inspired by "Choose Your Hard"