ఎవరో ఒకరు ఎపుడో అపుడు...
bheemkonduru ·

ఎవరో ఒకరు ఎపుడో అపుడు...
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు...
అటో ఇటో ఎటో వైపు...
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి...
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి...
వెనుక వచ్చువాళ్ళకు బాట అయినది
ఇంత చిన్న చిన్న మాటల్లో గొప్ప గొప్ప విషయాలు చెప్పడం కేవలం శాస్త్రి గారికే సొంతం. నాలుగు వాక్యాల్లో నాయకత్వం గురించి, అర్థవంతమైన పని చేసేటప్పుడు మనిషి ఎదుర్కొనే సంఘర్షణ గురించి, ఒంటరితనం గురించి, సమాజం యొక్క ప్రవర్తన గురించి, మార్పు గురించి ఎంత గొప్పగా చెప్పారో...ఎంత లోతుగా ఆలోచిస్తే అంత కొత్త కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. ఓ అందమైన ఉదయం, మంచి కప్పు కాఫీతో, ఒక పది నిమిషాలు ఈ పాట గురించి ఆలోచించండి. బాగుంటుంది.