Telugu Life

ఒక్క "Allow" వెనుక దాగిన కథ

bheemkonduru ·

ఏదో అవసరం వస్తుంది
కొత్త యాప్ ఇన్‌స్టాల్ చేస్తాం.
ఓపెన్‌ చెయ్యగానే
"Camera access ఇస్తారా?"
"Location allow చేస్తారా?"
"Contacts పర్మిషన్‌ ఇస్తారా?"
"Microphone?"
ఇలా వరసగా pop-ups
మనం పెద్దగా ఆలోచించం.
Allow.
అంతే.

ఫ్లాష్‌లైట్‌కి కాంటాక్ట్స్ ఎందుకు?

ఒక ఫ్లాష్‌లైట్ యాప్ మన కాంటాక్ట్స్ ఎందుకు చూడాలి?
ఒక Calculatorకి మన మైక్రోఫోన్‌తో ఏం పని?
ఒక చిన్న గేమ్‌కి మన Location ఎందుకు?
ఇవి మనం సాధారణంగా ప్రశ్నించం.
ఎందుకంటే ఆ రెండు సెకన్లలో మనకు కావాల్సింది యాప్.
పర్మిషన్స్‌ పట్టించుకోం
అందుకే మనం "Allow" కొట్టేస్తాం.
ఆ చిన్న ట్యాప్‌తో మన ఫోన్‌లోకి ఒక చిన్న తలుపు తెరుస్తాం. తర్వాత ఆ తలుపు ఎప్పుడు తెరిచామో కూడా మర్చిపోతాం.


అలవాటు అసలు సమస్య

ప్రతి యాప్‌ని అనుమానించమని కాదు
మన అలవాటును సరిచేసుకోవడం ప్రధానం
యాప్‌ ఏమి అడిగినా ఇచ్చేయడం
ఎంత సర్వసాధారణంగా మారిపోయిందో గమనించడం ముఖ్యం.


మూసేయాల్సిన తలుపులు

ఫోన్‌లో Permissions ఒకసారి చూసుకుంటే, మనమే ఆశ్చర్యపోవచ్చు.
ఎప్పుడో ఇన్‌స్టాల్ చేసిన యాప్‌కి Location ఇంకా Onలో ఉంది.
ఎప్పుడో వాడిన యాప్‌కి Contacts access ఉంది.
మనకు అవసరం లేని కొన్ని తలుపులు ఇంకా తెరిచే ఉన్నాయి.
వాటిని మూసేయడం పెద్ద Privacy mission ఏమీ కాదు.
ఇంట్లో తలుపులు, కిటికీలు ఒకసారి చెక్‌ చేసుకోవడం లాంటిది.
ఎవరైనా వస్తారని భయపడి కాదు.
అవసరం లేనప్పుడు తలుపు ఎందుకు తెరిచి ఉంచాలి?


ఒక్క ప్రశ్న

యాప్ ఇన్‌స్టాల్ చేసే సమయంలో ఒక్కసారి ఆలోచిస్తే
తిరిగితిరిగి ఆలోచించాల్సిన అవసరం ఉండదు.
"ఈ యాప్‌కి నిజంగా ఇది అవసరమా?"
ఆ ప్రశ్న అంత పెద్దది కాదు.
కానీ మన ఫోన్‌లోకి ఏది రావాలి, ఏది రాకూడదు అన్న నిర్ణయం మన చేతిలోనే ఉందని మనకు గుర్తుచేస్తుంది