Telugu Life

20-మైల్ జర్నీ

telugulife ·

సైకాలజీలో "20-మైల్ జర్నీ" అని ఒక చాలా ఇంపార్టెంట్ లెసన్ ఉంది.

ఒక వ్యక్తి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి నడిచి వెళ్ళాలనుకున్నాడు. దానికోసం ఒక రూల్ పెట్టుకున్నాడు: ప్రతిరోజూ 20 మైల్స్ నడవాలి.

ఫస్ట్ డే బాగా హుషారుగా ఉన్నాడు కాబట్టి 25 మైల్స్ నడిచాడు. రెండో రోజు కూడా 25 మైల్స్ నడిచాడు. అంటే రెండు రోజులకి కలిపి extra 10 మైల్స్ కవర్ చేశాడు.

థర్డ్ డే కొంచెం బద్దకం వచ్చింది. "నిన్న, మొన్న కలిపి ఆల్రెడీ 10 మైల్స్ extra నడిచాను కదా" అనుకుని, ఆ రోజు 10 మైల్స్ మాత్రమే నడిచాడు. ఆ తర్వాత రోజు 8 మైల్స్ నడిచాడు. "రేపు కవర్ చేసేద్దాంలే" అనుకున్నాడు. ఆ తర్వాత రోజుకి 5 మైల్స్ మాత్రమే నడిచాడు. "నెక్స్ట్ రెండు రోజుల్లో కవర్ చేద్దాంలే" అనుకున్నాడు.

కానీ ఆ గ్యాప్ ఎప్పటికీ కవర్ కాలేదు. చివరికి నడవడమే ఆపేశాడు.

తర్వాత మళ్ళీ మొదలుపెట్టాడు. ఈసారి ఫస్ట్ డే 20 మైల్స్ నడిచాడు. 21వ మైల్ నడవగలిగే ఓపిక ఉన్నా, ఆపేశాడు. సెకండ్ డే కూడా 20 మైల్స్ మాత్రమే. థర్డ్ డే కూడా 20 మైల్స్ మాత్రమే.

ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫిజికల్ మజిల్‌ని ఎక్సర్సైజ్‌తో ఎలా పెంచుకుంటామో, మెంటల్ మజిల్‌ని కూడా అలాగే అలవాటు చేయాలి. దానికి డిసిప్లిన్ ఒక్కటే మార్గం.

కాబట్టి ఈ "20-మైల్" థింగ్ ని మీ మైండ్ లో పెట్టుకోండి. అంటే, "నేను రోజూ 20 మినిట్స్ ఫిజిక్స్ చదువుతాను" అని పెట్టుకున్నారనుకోండి. అంతే. 21వ మినిట్ కూడా చదవకండి. స్టాప్ ఎట్ 20 మినిట్స్ ఓన్లీ.

డోంట్ గో ఫర్ ద 21st మినిట్. ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా సరే, అక్కడే ఆగి, నెక్స్ట్ డే కోసం వెయిట్ చేయండి. దెన్ సీ వాట్ విల్ హాపెన్.

Source: Director Trivikram Srinivas Speech (YouTube)